in

shocking remuneration for ramya krishna!

మ్యకృష్ణ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా వెండితెరను ఏలిన రమ్యకృష్ణ.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఎలాంటి పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేయడంలో రమ్యకృష్ణ మహా దిట్ట. ఇక బాహుబలి చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి శివగామిగా వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. ప్రస్తుతం తెలుగులో రంగ మార్తాండ, విజయ్‌ దేవరకొండ ఫైటర్‌, తమిళ్‌లో ఉయర్నథ మనిథన్‌, పార్టీ చిత్రాలతో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా రమ్యకృష్ణ నటిస్తోంది.

అయితే ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 50ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్ల స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందట రమ్యకృష్ణ. ప్రస్తుతం రోజుకి 10 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తోందట రమ్యక్రిష్ణ. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే కోటి వరకు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పవర్‌ఫుల్‌ రోల్స్‌ ప్లే చేస్తోన్న రమ్యకృష్ణ.. అంతేస్థాయిలో పారితోషకం పుచ్చుకుంటుందన్నమాట.

jr ntr’s message for social media users!

f cube ‘sai pallavi’!