in

jr ntr’s message for social media users!

మహమ్మారి సోకి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలతో సైబరాబాద్ పోలీసు కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్పందన సైతం లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు తాజాగా సైబర్ మోసాలపై ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ తో ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియలో ఓ యువతికి ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఆమెకు ఎదురైన అనుభవాన్ని చూపించడంతోపాటు ఎన్టీఆర్ సందేశాన్ని జోడించారు హైదరాబాద్ పోలీసులు. ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణమవుతాయని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్టీఆర్ సూచించారు. అయితే సైబర్ మోసాలపై అవగాహన కలిగిస్తున్న హైదరాబాద్ నగర పోలీసులపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..

Amitabh Bachchan roped in for prabhas next!

shocking remuneration for ramya krishna!