in

anushka learned sign language for ‘nishabdam’!

తంలో పలువురు హీరోల సరసన కథానాయికగా పలు చిత్రాలలో నటించిన అనుష్క తాజాగా నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత వుంది. ఇందులో ఆమె పెయింటర్ పాత్ర పోషించడం ఒకటైతే.. మూగ యువతిగా నటించడం మరొకటి! ఇది చాలా ఛాలెంజ్ తో కూడిన పాత్ర అని అనుష్క చెప్పింది. ఇక ఈ సినిమాలో నేను మూగ అమ్మాయిని కాబట్టి నా పాత్రకు మాటలు లేవు.

అసలు ఇది వెరైటీ అవుతుందనే ఈ పాత్ర ఒప్పుకున్నాను. ఈ పాత్ర పోషణ కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ని నేర్చుకున్నాను. అయితే, షూటింగ్ కోసం అమెరికా వెళ్లాక సైన్ లాంగ్వేజ్ వేరే ఉంటుందని తెలిసింది. అప్పుడు మళ్లీ అక్కడ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ ని పద్నాలుగేళ్ల అమ్మాయి వద్ద నేర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.అలా ఈ సినిమా కోసం కాస్త ప్రాక్టీస్ కూడా చేయాల్సి వచ్చిందని స్వీటీ చెప్పింది.

ismart beauty’s movie is going to release in ott!

allu arjun to promote manchu vishnu’s movie!