in

priyamani second innings joru!

మదొంగ, పెళ్ళైన కొత్తలో , రగడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి.. పెళ్ళి తర్వాత సినిమాలు చెయ్యడం మానేసింది.. చాల గ్యాప్ తర్వాత మళ్లీ ఈమె టీవీ షోస్‌లో జడ్జ్‌గా కనిపించడమే కాదు ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో వెంకటేష్‌ ‘నారప్ప’ చిత్రంలో సుందరమ్మగా నటిస్తుంది. అలాగే రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’లో కామ్రేడ్‌ భారతక్కగా నటనకు అస్కారమున్న పాత్రలో నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలే కాకుండా బాలీవుడ్‌, కన్నడలో కూడా ఆమె చిత్రాలు చేస్తుంది. అలాగే ‘ద ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌, బుల్లితెరపై ‘ఢీ’ షోతో బిజీబిజీగా ఉన్న ప్రియమణి.. ఇప్పుడు మరో చిత్రానికి సైన్‌ చేసింది. ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుండటం విశేషం. ఇలా పెళ్లి తర్వాత వరుస ఛాన్సులు దక్కించుకోవడం నిజంగా ప్రియమణికే దక్కింది.

balayya support to jaya prakash reddy family!

sam playing a challenging role!