in

sam playing a challenging role!

టాలీవుడ్ లో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత..పెళ్లి తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సామాజిక సేవలు , బిజినెస్ లు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే..నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన మజిలీ మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

ఇక ఇటీవల వచ్చిన 96 రీమేక్ ‘జాను’ మాత్రం నిరాశ పరిచిన సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. గతంలో ‘మయూరి’, గేమ్ ఓవర్’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు అశ్విన్ ఇప్పుడు సమంత హీరోయిన్ గా హారర్ కథాంశంతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. తెలుగు, తమిళ ద్విభాషా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సమంత మూగ, బధిర యువతిగా కనిపించనుందని టాక్

priyamani second innings joru!

okka paisa kuda theesukokunda anni patalu rasina sirivennela sitarama sastry!