in

this is the reason why anushka doesn’t have a twitter account!

సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన అనుష్క శెట్టి ‘భాగమతి’ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్  ద్వారానే అనుష్క అభిమానులను పలకరిస్తుంది. తాజాగా ఆమె అభిమానులు ట్విట్టర్ లోకి ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. ” నాకు కొంచం సిగ్గు ఎక్కువ కొత్తవాళ్లతో అంతత్వరగా కలవలేను. సినిమాలే నా ప్రపంచం.  సినిమాలు లేకపోతే ఇంట్లోనే గడిపేస్తా.. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీలేవు. టైం కుదరడం లేదు అంతే . ట్విట్టర్ లోకి రాకపోవడానికి కూడా ఇదికూడా ఒక కారణం. నిజానికి దానిగురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నా మనసుకు అనిపిస్తే ట్విట్టర్ లోకి అడుగుపెడతా ” అని చెప్పుకొచ్చింది అనుష్క .

pooja hegde dual role in ‘ radhe shyam’?

rashmika to work with vijay again!