కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా.. ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక చైతన్యను పెళ్ళి చేసుకున్నాక.. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అలాగే కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలనే చేస్తూ ముందుకు సాగుతుంది. ఈమె సంపాదన కూడా అదే రేంజ్ లో ఉందనుకోండి. తాజాగా సమంత.. bmw X5 కారును కొనుగోలు చేసిందట. ఈ కారు ధర అక్షరాల 76 లక్షల రూపాయలు. ఇది బుల్లెట్ ప్రూఫ్ అట. 100 కి.మీల వేగాన్ని కేవలం 5 సెకన్ల లో అందుకునే కెపాసిటీ ఉన్న కారు ఇదని తెలుస్తుంది.
దీంతో పాటు సమంత దగ్గర. జాగ్వార్ XF అనే మరో లగ్జరీ కారు ఉంది. ఈ కారు ధర 62 లక్షలు అని తెలుస్తుంది.కొత్త కారు కొనే ముందు వరకూ సమంత ఈ కారునే వాడేదట. అంతేకాదు ఆడీ క్యూ 7 అనే మరో కారు కూడా సమంతకు ఉంది. ఈ కారు 78 లక్షల రూపాయలు ఉంటుందట. ఇండియాలో ఎక్కువ మంది కొనుగోలు చేసే కారు ఇదని తెలుస్తుంది. ఎన్నో అడ్వాన్స్ ఫీచర్స్ తో ఈ కారు ఉంటుందని తెలుస్తుంది. పైనున్న వన్నీ ఒక ఎత్తు అయితే.1 కోటి 15 లక్షల విలువ చేసే పోర్షే కేమ్యాన్ జేటీఎస్ కారు మరొక ఎత్తు. ఎంతో ఇష్టపడి సమంత ఈ కారు కొనుగోలు చేసిందట.