రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి మంచు చిరుజల్లలను కొత్తగా ఎంజాయ్ చేశారు. వారిద్దరు ఈరోజు సర్ ప్రైజ్ టాస్క్ పూర్తి చేశారు. 30 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా సైకిల్ తొక్కారు. ఇద్దరు ఫిట్ నెస్ ఫ్రీక్స్ అయినా 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం సాధారణ విషయమేం కాదు. వీరు తరచుగా ఫిట్ నెస్ గేమ్స్ కలిసి ఆడుతుంటారు. హైదరాబాదులో వరుస వర్షాలతో ఇపుడు రొమాంటిక్ వెదర్ ఉంది. ఈ సమయంలో సైక్లింగ్ ను చక్కగా ఎంజాయ్ చేశారు.
సుమారు 30 కిలోమీటర్ల వరకు, రకుల్ మరియు లక్ష్మి సైక్లింగ్ చేశారు. వారితో పాటు ముఖ సైక్లిస్ట్ ఆదిత్య మెహతా , అతని బృందం ఉన్నారు. ఈ పోస్టులను షేర్ చేసిన ఆదిత్య మెహతా ఇలా రాశారు, “ఈ రోజు లక్ష్మి, రకుల్ తో పాటు అమన్ ప్రీత్ & టీం ఆదిత్య సుచిత్రా ఎక్స్ రోడ్ నుండి తూప్రాన్ రోడ్ వైపు 30 కిలోమీటర్ల ప్రయాణించారు. ఇది వారి మొదటి 30 కి.మీ లాంగ్ సైకిల్ రైడ్. అయినా ప్రొఫెషనల్ సైక్లిస్టుల మాదిరి సైక్లింగ్ చేశారు” దానిని రీట్వీట్ చేస్తూ రకుల్ సైక్లిస్ట్. మెహతాకు కృతజ్ఞతలు తెలిపారు. “థాంక్యూ యు మేము దీన్ని ఇష్టపడ్డాము .. త్వరలో 100 కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేయగలం అనుకుంటున్నాం” అంటూ షాకింగ్ కామెంట్ చేసింది బ్యూటీ.