in

Trisha marrying that controversial hero?

త్వరలో హీరోయిన్ త్రిష పెళ్లిపీటలు ఎక్కనుందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుని త్రిష పెళ్లిచేసుకోబోతోందంటు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెళ్లి అంటే అంతా ఆశ్చర్యపోవడం సహజమే. ఎందుకంటే ఇప్పటికే ఆమె పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి. ఆ నటుడి విషయంలో స్పందించిన త్రిష.. అతను కేవలం ప్రాణ స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.

అయితే తాజాగా కోలీవుడ్‌లో త్రిష పెళ్లి విషయమై మరో వార్త హల్‌చల్ చేస్తోంది. వివాదాల హీరో శింబుతో త్రిష పెళ్లిపీటలు ఎక్కనుందని సమాచారం. శింబు విషయానికి వస్తే.. పెళ్లి విషయంలో ఆయనది కూడా సేమ్ రూటే. నయనతారతో ప్రేమాయణం, హన్సికతో ప్రేమ, పెళ్లి వంటి వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలోనే వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం ఈ టాపిక్‌పై కథనాలు వెలువడుతున్నాయి..

deepika getting paid more than prabhas!

pantham negginchukunna krishna vamsi!