in

air hostess nu aata pattinchina ALI AND ANOOP RUBENs!

హాస్య నటుడు అలీ గారు ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల జల్లు కురుస్తుంది, వెండి తెర మీదే కాదు బయట కూడా ఆయన చాల సరదాగా ఉంటూ పక్క వారిని నవ్విస్తూ ఉంటారు. అటువంటి అనుభవమే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు కలిగింది. అదేమిటి అంటే, అలీ గారు, అనూప్ రూబెన్స్ ఇద్దరు కలసి బ్యాంకాక్ లో జరగబోయే హార్ట్ అటాక్ మూవీ ఆడియో ఫంక్షన్ కి థాయ్ ఎయిర్ వేస్ లో బయలుదేరారు.అలీ గారు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ఐ నీడ్ వన్ కాట్రవల్లీ కండో అని అడిగారట, అదేదో తినే పదార్ధం అనుకోని ఆమె వెళ్లి వాళ్ళ ఇంచార్జి కి చెప్పిందట ఆ పాసెంజర్ ఎదో అడుగుతున్నారు నాకు అర్ధం కాలేదు అని.

వెంటనే అతను వచ్చి సర్ మీరు చెప్పిన ఐటెం ఒక సారి రాసి చూపమని అడిగాడట, ఒక స్లిప్ మీద అలీ గారు ఇంగ్లీష్ లో కాట్రవల్లీ కండో అని రాసి ఇచ్చారట, అది పట్టుకెళ్లి ప్రపంచం లో ఉండే అన్ని రకాల మెనూ కార్డ్స్ వెతికి, ఇక లాభం లేదు అని తిరిగి వీరి దగ్గరకు వచ్చి సారీ సర్ మీరు అడిగిన ఐటెం లేదు అని చెప్పాడట. వాళ్ళు పడుతున్న కంగారు చూసి వీరిద్దరూ తెగ నవ్వుకున్నారు, అనూప్ రూబెన్స్ అయితే నవ్వి, నవ్వి తల పట్టేసిందట. కానీ వీళ్ళు ఫ్లైట్ దిగాక ఆ ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన షాక్ కి వీళ్లకు దిమ్మతిరిగింది. ఆమె నవ్వుతు సారీ సర్ నెక్స్ట్ టైం వెన్ యు కం ఐ విల్ గెట్ యు కాట్రవల్లీ కండో, బాయ్ బాయ్ అని వెళ్లిపోయిందట.

star anchors not ready for shootings!

CHAITHU PREFERRED RASHMIKA OVER KEERTHI?