అడివి శేష్ గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ కి చెందిన జీఎంబీ బ్యానర్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మేజర్ ప్రారంభమైంది. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో చిత్రమిది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. మేజర్ చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయింది? అన్నదానిపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే శర్వానంద్ హీరోగా మహేష్ తన జీఎంబీ ప్రొడక్షన్స్ కింద మరో సినిమాను నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం, అంతా అనుకున్నట్టు సాగితే.. మరో రెండు మూడు వారాల వ్యవధిలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుందట.