టాలీవుడ్ క్వీన్ అనుష్క పెళ్లి గురించి మీడియాలో ఎప్పటినుండో జోరుగా ప్రచారం జరుగుతుంది.. ఆమద్య ఒక క్రికెటర్ తో అనుష్క పెళ్లి ఫిక్స్ అయ్యింది పెళ్లికి రెడీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక దర్శకుడి కొడుకుతో పెళ్లికి అనుష్క రెడీ అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే ఆ దర్శకుడి కొడుకుకు అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు కూడా అయ్యాయి. దాంతో అంతా కూడా అవాక్కయ్యారు. అయితే ఆ వార్తలు నిజం కాదని ఎక్కువ మంది అన్నారు. దాంతో నిజమే అనుష్కకు రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఆ వార్తలను చాలా మంది నమ్మలేదు. కాని మళ్లీ ఆ వార్తలే ప్రముఖంగా వస్తున్నాయి.
ఆ దర్శకుడి కొడుకును అనుష్క వివాహం చేసుకోబోతున్న విషయం నిజమే అన్నట్లుగా ఇండస్ట్రీలో ప్రముఖంగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే ఆయనతో పెళ్లికి రెడీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కుటుంబంకు అనుష్క చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందనేది కొందరి వాదన. కాని అనుష్క అభిమానులు మాత్రం ఈ వార్త నిజం కాకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటీ.. ఆయన సినిమాల్లో సక్సెస్ కాలేదు మరే విధంగా కూడా ఆయన అనుష్కకు సరి జోడీ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం.