హీరో సుశాంత్ సింగ్ ఆత్మ హత్య నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్ తో తమకు గల చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ సైతం ఈ విషయంపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ…’ఇండస్ట్రీలో ఒకప్పుడు నన్ను కూడా దూరం పెట్టారు. నువ్వు హీరోయిన్ గా పనికిరావని ఎవరైనా అన్నప్పుడు గుండె పగిలిపోయేది.
అలాంటి టైమ్ లో ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. వారన్న మాటలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేవి. ఎంతో కుంగిపోయాను కూడా.కానీ నేను ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించలేదు.ఎప్పుడైనా సరే మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీ మనసు లోపల దాగిన కష్టాలను.. కలిగిన నష్టాలను.. మీలోని బలహీనతలు ఇతరులతో పంచుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి కావాల్సిన వాళ్లకి బాధలు చెప్పుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు’ అని పాయల్ చెప్పుకొచ్చారు.