in

sr ntr’s review on ‘jvas’!

గదేక వీరుడు అతిలోక సుందరి.. మాములు సినిమా కాదు. మరి దాని రిలీజు మాములుగా ఎలా ఉంటది.. 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పట్లో ఈ చిత్రాన్ని అతి పెద్ద బడ్జెట్ తో నిర్మించారు. అప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ సరిగ్గా కుదిరాయి అన్న సమయానికి మే 6వ తేదిన తుఫాను వార్తలు మొదలయ్యాయి. సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలీని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. దీంతో తుఫాన్ ను ఎదిరించి థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. అయితే భారీ వర్షాలతో పలు థియేటర్లలోకి ప్రొటెక్టర్ రూమ్ లోకి నీళ్లు కూడా పోయాయి. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన ఈ సినిమా నీటి పాలవుతుందని.. చేసిన ప్రమోషన్లు వరద నీళ్లలో కొట్టుకుపోతాయని అశ్వనీదత్ ఆలోచించారు. తరువాత జరగాల్సినది చూడాలి అనుకుంటూ అశ్వనీదత్ – రాఘవేంద్రరావు విజయవాడ వెళ్లారు. మరుసటి రోజు ఇద్దరూ గుంటూరులోని ఓ థియేటర్కు వెళ్లారట. అక్కడ క్లాస్ ఆడియెన్స్ మాస్ ఆడియెన్స్ లా చప్పట్లు ఈలలతో రెచ్చిపోతున్నారట. అప్పుడే మరో మరుపురాని సంఘటన జరిగింది.

సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉండగా.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన చేస్తూ వారికి ఎదురుపడ్డారట. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా రిపోర్ట్ బావుంది. సెటిల్ అయిపోతావు. కంగారు పడకు. నేను చెప్తున్నా’ అని ధైర్యం చెప్పి తన ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోయారట. అంతేకాకుండా అప్పుడే సైకిల్ పై అరటి పళ్లతో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ‘ఇప్పుడే సినిమా చూశాను. అదిరిపోయింది. సంవత్సరం ఆడుతుంది’ అని గట్టిగా అరిచాడట. దీంతో అశ్వినీ దత్ – రాఘవేంద్రరావు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారట. ఇక అక్కడి నుంచి ఈ సినిమాను తుఫాను వర్షం ఏవీ జగదేక వీరుడు అతిలోక సుందరిని ఆపలేకపోయాయి.

surekha vani about her daughter!

oka diggaja natudu, maroka diggaja gayakudiki paatalu paadina vela!