in

Yash reveals about his early struggles!

యాష్..ఒక సంచలనం,అప్పటి వరకు సాదా సీదా హీరో అయిన ఈయన ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు..దేశ వ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాఖీభాయ్ క దశలో ఇంటి నుంచి పారిపోయాడట. కేవలం 300 వందలతో బెంగళూరు చేరుకున్నారట. నటుడు కావాలనే కలతో ఇంటి నుంచి పారిపోయాడట.

ఈ విషయాన్ని హీరో యష్ స్వయంగా వెల్లడించారు. నేను ఇంటి నుంచి పారిపోయి బెంగళూరు వచ్చేశా. తరువాత చాలా భయపడ్డా. అయినా అంతులేని ఆత్మవిశ్వాసంతో వుండేవాడిని. ఆ సమయంలో తన వద్ద 300 మాత్రమే వున్నాయని, తిరిగి వెళితే ఇంటికి రానివ్వరని తెలుసు. అందుకే నటుడిగా నా అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నానని చెప్పుకొచ్చాడు.

తిరిగి ఇంటికి వస్తానని అమ్మా నాన్నా అనుకున్నారు కానీ నేను మాత్రం థియేటర్‌లో నటించడం మొదలుపెట్టా. అదృష్ట వశాత్తు ఓ వ్యక్తి తన నటన నచ్చి థియేటర్‌కి తీసుకున్నాడు. అక్కడి నుంచి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టా. టీలు అందించడం నుంచి ప్రతీ పని చేశా. స్టేజ్‌పై నటన చూసి అవకాశం ఇచ్చారు` అని తన కెరీర్‌లో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాల్ని యష్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

WIVES EARNING MORE THAN OUR STAR HEROES!

netizens fire on these challenges!