కొరటాల శివ, పరిచయం అక్కర్లేని టాలీవుడ్ డైరెక్టర్. చేసింది చాల తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీ లో ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించారు. ప్రతి డైరెక్టర్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ సినిమాలో ఆ ఎలిమెంట్ కచ్చితంగా ఉండేలా జాగ్రత్త పడుతారు. అలానే శివ గారి సినిమాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది, అదే సామాజిక కోణం. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ గ మనకు అర్ధం అవుతుంది.
తాజాగా కొరటాల శివ గారికి ఉన్న సామాజిక కోణం గురించి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తిగల విషయాలు వెల్లడించారు. శివ గారు బైటికి కనిపించరు, కానీ తనకు సమాజం పట్ల ఎంతో అవగాహన, గౌరవం ఉందని చెప్పారు చిరు. తన భార్యతో కలిసి శివ గారి ఆదాయంలో కొంత భాగాన్ని సమాజసేవకు ఇస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి కొరటాల అని చిరు మెచ్చుకున్నారు. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేము అని గ్రహించి పిల్లలను కనవద్దని కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట వీరు అని చెప్పారు చిరు..