in

twists is amala’s second marriage!

హీరోయిన్ అమలా పాల్ సినిమా కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో ఉంటుంది. తాజాగా ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ మధ్యే ఈమె రెండో పెళ్లి చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. దానికితోడు ఫోటోలు కూడా బయటికి వచ్చేసరికి అంతా నిజమే అనుకున్నారు. అయితే పెళ్లి ఫోటోలు వచ్చి మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అటు అమలా పాల్ కానీ ఇటు భవీందర్ సింగ్ కానీ బయటికి రాలేదు. పెళ్ళి గురించి చెప్పలేదు. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. అసలు ఈ పెళ్లి అబద్ధమని.. రెండో పెళ్లి చేసుకోలేదని అమలా పాల్ సన్నిహితులు చెబుతున్నారు.

ఇదంతా భవీందర్ ప్లాన్ ప్రకారమే చేసాడని వాళ్ళు చెబుతున్నారు. మ్యాటర్ ఏంటంటే ఈ ఇద్దరూ విడిపోయారు కూడా. భవీందర్ సింగ్‌తో విడిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక హిమాలయాలకు అమలా పాల్ వెళ్లిందని సన్నిహితులు చెబుతున్న సమాచారం. మరి ఈ ఫోటోలు ఎక్కడ్నుంచి వచ్చాయంటే.. అప్పుడెప్పుడో ఓ సారి యాడ్ ప్రమోషన్ కోసం తీసినవే అంటూ అమలా పాల్ మేనేజర్ చెబుతున్నాడు. అంతేకానీ ఆమెకు సీక్రెట్‌గా పెళ్ళి చేసుకోవలసిన అవసరం ఏముందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. డిజైనర్ దుస్తులు కూడా ధరించకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారా అని రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు అమలా పాల్ తరఫు బంధువులు.

బయటికి వచ్చిన ఈ ఫోటోలు భవిందర్ సింగ్ తన అఫీషియల్ అకౌంట్‌లో పోస్ట్ చేసినవే. కానీ వెంటనే డిలీట్ చేసాడు కూడా. అసలు ఎందుకు పోస్ట్ చేసినట్లు.. ఎందుకు తీసేసినట్లు అంటూ ఆయన్ని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమలా పాల్ రెండో పెళ్లిపై అంతటా కన్ఫ్యూజన్ వచ్చేసింది. నిజానికి అమలా పాల్, భవిందర్ సింగ్ డేటింగ్ చేస్తున్న మాట నిజమే కానీ కొన్ని రోజుల కిందే విడిపోయారు అంటున్నారు సన్నిహితులు. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా కూడా దాచిపెట్టాల్సిన అవసరం అయితే వాళ్లకు లేదంటున్నారు వాళ్లు. మొత్తానికి దీనిపై అమలా పాల్ బయటికి వచ్చి చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

sweety gets emotional about his director!

THULASI GARI STHANAMLO AHUTHI PRASAD!