హీరో సిద్ధార్థ్‌పై అక్కినేని సమంతా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అతని విషయంలో ఏమాత్రం నాన్చకుండా బయటకు రావడం తాను తీసుకున్న ఎంతో కీలకమైన నిర్ణయంగా చెప్పుకొచ్చింది. సావిత్రి జీవితంలో ఏ విధమైన కష్టాలు సంభవించాయో తన జీవితంలో కూడా అలాంటివే చోటు చేసుకున్నాయని వెల్లడించింది. అలాంటి వాటిని తాను ముందుగానే నేను పసిగట్టడంతో జాగ్రత్తపడ్డానని తెలిపింది. అందుకే తన జీవితం కాబట్టే నా జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. నాగచైతన్య తనకు భగవంతుడు ఇచ్చిన కానుక అని, అందరికీ అలాగే అర్థం చేసుకునే భర్త దొరకాలని పేర్కొంది.
కాగా సిద్ధార్ధ్ కలిసి గతంలో సమంత జబర్ధస్త్ అనే సినిమా తీసింది. ఆ సమయంలో వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఓ దశలో వీరి పెళ్లి కోసం రాహు కేతు పూజలు కూడా చేసిన పొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో వీరి లవ్‌కు బ్రేక్ పడింది. కొంత కాలానికి నాగ చైతన్యను ప్రేమించడం, పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఈ సమయంలో ఆమె సిద్ధార్థ్ ప్రస్తావన తీసుకురావడంతో ఏం జరిగిందని ఫిలిం వర్గాలు చర్చించుకుంటున్నాయి.