[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మా[/qodef_dropcaps]స్ మహారాజా రవితేజ హీరోగా నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
‘డిస్కోరాజా’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇది ఒక డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా ఇరగదీశారని కొంత మంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ అని ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ కొత్త అవతారంలో అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన భుజస్కందాలపై మోసరని కూడా చెబుతున్నారు. వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించారని అంటున్నారు. సునీల్‌కు కూడా మంచి పాత్ర దక్కిందని కొంత మంది ట్వీట్లు చేశారు. క్లైమాక్స్‌లో ఆయన కుమ్మేశారట. విలన్‌గా బాబీ సింహా అదరగొట్టారని అంటున్నారు.
తమన్ మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట. మొత్తంగా సినిమా బాగుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కాస్త నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. కొంతమంది రవితేజ మరోసారి నిరాశపరిచారని నిట్టూరుస్తున్నారు. స్టోరీ లైన్ వెరైటీగా ఉన్నా దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో సినిమాను రొటీన్‌గా మార్చేశారని అంటున్నారు. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాకు సైన్స్ ఫిక్షన్ అనే ట్యాగ్ తగిలించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఓవరాల్‌గా రవితేజ హిట్టు కొట్టినట్టే కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడితే అసలు టాక్ బయటికి వచ్చేస్తుంది.