[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps]ల వైకుంఠపురములో సినిమా విజయంతో జోరు మీదున్నాడు అల్లు అర్జున్. కొన్ని రోజులుగా సక్సెస్ సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్‌కు ఇప్పుడు పిడుగు లాంటి వార్త వచ్చింది. ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. విజయానందంలో తేలిపోతున్న ఈ కుటుంబంలో ఓ వ్యక్తి తగ్గిపోయాడు. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం పాలయ్యాడు. ఇది అల్లు ఫ్యామిలీకి షాకింగ్‌గా మారింది. అనుకోకుండా వచ్చిన ఈ పిడుగు లాంటి వార్త ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి చేదు గుళికగా మారిపోయింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు ఈయన మేనమామ నిర్మాతగా కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర పనుల్లోనే బిజీగా ఉన్న బన్నీకి మేనమామ మరణం అనుకోని షాక్. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య ఈయన. చిన్నప్పటి నుంచి కూడా మేనమామతో చాలా సన్నిహితంగా ఉన్నాడు బన్నీ.
ఇప్పుడు ముత్తంశెట్టి ప్రసాద్ మరణవార్త అల్లు కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. విజయవాడలో జనవరి 22న ఈయన కన్నుమూసారు. ఈ విషయం తెలియగానే అల్లు కుటుంబం అంతా అక్కడికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోని పలువురు కూడా ఈయన కుటుంబానికి సంతాపం తెలియచేసారు.