[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]వె[/qodef_dropcaps] న్నెల కిషోర్ తరువాత ప్రస్తుతం కామెడీ పాత్రలు చేయడంలో రాహుల్ రామకృష్ణకు మంచిపేరు వస్తోంది.
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో తన అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉంటూ అనేక విషయాల పై స్పందించే ఈ కమెడియన్ తాను రేప్ కు గురైనట్లు చెప్పడం చాల ఆశ్చర్యాన్ని కలిగించింది.
ప్రస్తుతం చిన్న పిల్లల పై కూడ అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్న నేపధ్యంలో ఆసంఘటనలు దృష్టిలో పెట్టుకుని రాహుల్ ఇలా సెటైరికల్ గా కామెంట్ చేసాడా ? నిజంగానే అటువంటి సంఘటన అతడికి ఎదురైంద అన్న విషయమై క్లారిటీ లేదు. దీనితో రాహుల్ కు చిన్నప్పుడే అనుకోని సంఘటన ఎదురైంది అని భావిస్తూ అతడి అభిమానులు అతడి పై సానుభూతిని చూపెడుతూ కామెంట్ చేస్తున్నారు