
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సా[/qodef_dropcaps] మజవరగమన నిను చూసి ఆగగలనా.’ ఇప్పుడు ఎక్కడ చుసిన వినిపిస్తున్న పాట ఇది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఈ పాట విడుదల అయినప్పటినుంచే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇప్పటికే మిలిమన్ నుంచి బిలియన్ వ్యూస్ దిశగా దూసుకపోతూ సెన్సేషన్ సృష్టించబోతోంది ఈ సాంగ్. తాజాగా ‘సామజవరగమన’మరో మైలు రాయిని అందుకుంది. యూట్యూబ్‌లో వన్ మిలియన్ లైక్‌లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్లో ఓ సినిమాకు సంబంధించిన ట్రైలర్/టీజర్/వీడియో సాంగ్‌కు ఇన్ని లైక్‌లు రావడం ఇదే ప్రథమం కావడం విశేషం.
