in

PRUTHVI GARI CAREER NE MARCHESINA AA OKKA DIALOGUE!

పృథ్వీ రాజ్, ఈ పేరు వినగానే బహుశా అందరికి అతనెవరో గుర్తురాకపోవచ్చు. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ ఈ డైలాగ్ తో అతనెవరో ఇప్పుడు మీకు గుర్తోచేవుంటాడు కదా.. ఖడ్గం సినిమాలో ఈ డైలాగ్ ని ఫస్ట్ టైమ్ చెప్పి అప్పటినుండి చాల సినిమాల్లో దాన్ని వాడుకొని ఇండస్ట్రీ లొ మంచి గుర్తింపు తెచ్చుకొని నిలదొక్కుకుంటారు మన కమెడియన్ పృథ్వీ రాజ్ గారు. అయితే ’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అని పృథి గారు ట్రెండ్ సెట్ చేసిన ఈ డైలాగ్ నిజానికి ఖడ్గం సినిమా స్క్రిప్ట్ లొ అసలు లేదట. సినిమాలో రవి తేజ సిన్ లొ ఎంటర్ అయ్యి పృథ్వీ గారు ఎన్ని సార్లు టేక్ చేసిన చెప్పలేని డైలాగ్ ని అతను చెప్పాలి. ఎంత టాలెంట్ ఉన్న నాకు మాత్రం సినిమా అవకాశాలు దక్కడం లేదు, కానీ ఏమి యాక్టింగ్ రాకున్నా పృథ్వీ 30 ఇయర్స్ నుండి ఇండస్ట్రీ లొ తన బ్యాక్ గ్రౌండ్ వాడుకొని హీరోగా చేస్తున్నాడు అని సినిమాలో రవి తేజ కి కోపం రావాలి. ఆలా ఆ ఫీల్ రావడానికి సెట్స్ లొ అక్కడికి అక్కడే స్క్రిప్ట్ ని మార్చి ’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే డైలాగ్ ని పృథ్వీ గారి చేత బలవంతంగా చెప్పించారు డైరెక్టర్ కృష్ణ వంశి గారు. ఆలా ఆరోజు వంశి గారు చేసిన ఒక చిన్న డైలాగ్ మార్పు  నా జీవితాన్నే మార్చేసింది అని స్వయానా  పృథ్వీ గారే చాల సందర్భాలలో చెప్పడం జరిగింది.

ileana’s breakup secret!

TOP 10 TALLEST ACTORS OF TOLLYWOOD!