10. అల్లరి ప్రియుడు
ఈ సినిమా ముందు నాగార్జున చేతికి వెళ్ళింది కాని అప్పటికే బిజీ గా ఉన్న నాగ్ ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.
09. అర్జున్ రెడ్డి
తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి.ఈ సినిమాతో సందీప్ వంగ ,విజయ్ దేవరకొండ ఎక్కడికో వెళ్లిపోయారు. అయితే ఈ కథను డైరెక్టర్ మొదటిగా అల్లు అర్జున్ కి వినిపించాడు అతను రిజెక్ట్ చెయ్యడంతో శర్వానంద్ కి వినిపించాడు.కానీ సినిమా లో ఉన్న బొల్డ్నేస్ కు భయపడి సర్వ కూడా రిజెక్ట్ చెయ్యడంతో విజయ్ దేవరకొండ చేశాడు.
08. భలే భలే మగాడివోయ్
నాని కెరీర్ కో అతి పెద్ద విజయం సాధించిన సినిమా భలే భలే మగాడివోయ్…అయితే ఈ కథను మారుతి బన్నీ కోసం ఎంత గానో ట్రై చేశాడు.కానీ దానిని అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడు
07. రోజా
మణిరత్నం సినిమా రోజా లో ముందు వెంకీ నీ హీరో. గా అనుకున్నారు కారణం ఏమిటో తెలియదు కానీ వెంకటేష్ ఆ సినిమాను చెయ్యలేదు.
06. ఫిదా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఫిదా ను మహేష్ బాబు రిజెక్ట్ చసాడు.
05. కిక్
కిక్ సినిమాను కూడా ఎన్ టి ఆర్ ను దృష్టి లో పెట్కుని రాశారు.తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతలు భాగంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
04. ఎవడు
ఎవడు సినిమాను ఎన్ టి ఆర్,కళ్యాణ్ రామ్ చెయ్యాల్సింది.కానీ వాళ్ళు రిజెక్ట్ చెయ్యడం తో అది కాస్త రామ్ చరణ్ అల్లు అర్జున్ లు నటించారు.
03. సింహాద్రి
బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ సింహాద్రి కథను ను కూడా ప్రముఖ రచయిత విజెంద్ర ప్రసాద్ ఎన్ టి ఆర్ కోసం రాయలేదు.తన బాల కృష్ణ కోసం రాశాడు కానీ బాలయ్య దానిని రిజెక్ట్ చెయ్యడం తో అబ్బాయి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు
02. ఖైదీ
చిరంజీవి టర్నింగ్ పాయింట్ ఖైదీ సినిమాకి హీరోగా మొదట కృష్ణ గారినే సంప్రదించారు…అయితే అప్పటికి కృష్ణ గారు బిజీ ఉండడంతో ఆ మోవైను వదిలేసుకున్నరు.
01. ఠాగూర్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన ఠాగూర్.ఈ చిత్రాన్ని రాజశేఖర్ చేద్దాం అనుకుంటుండగా చిరంజీవి చేశారు అని వార్తలు వినిపించాయి.