in

2 titles in consideration for mahesh babu rajamouli film?

సినిమా కథా నేపధ్యం ఒక అడ్వెంచర్‌ లా ఉంటుంది అని ఇంతకు ముందు రాజమౌళి చెప్పారు. మహేష్‌ తో చేస్తున్న సినిమా యాక్షన్‌ సినిమాగా ఉంటుందని, అది జేమ్స్‌ బాండ్‌ తరహాలో లేదా ఇండియానా జోన్స్‌ తరహాలో ఉంటుందని, అయితే అది భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మితమై ఉంటుందని రాజమౌళి ఇంతకుముందు ఒక మీడియా సంస్థలతో మాట్లాడుతూ చెప్పారు.

ఈ సినిమా కోసమే ఈమధ్యనే మహేష్‌ బాబు జర్మనీ వెళ్లి కొన్ని రోజులు శారీరక శిక్షణ పొందిన సంగతి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా టైటిల్స్‌ గురించి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకి రెండు పేర్లను అనుకుంటున్నట్టుగా అందులో ఒకటి ‘మహారాజా’ ఇంకోటి ‘చక్రవర్తి’ అని ఇలా వైరల్‌ అవుతున్నాయి..!!

Sandeep vanga Wants To Move To Hollywood!

balayya gives chance for another young director!