in

balayya gives chance for another young director!

ప్రస్తుతం ఆయన తన 109వ సినిమా షూటింగులో ఉన్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ‘అఖండ’ సీక్వెల్ కోసం బోయపాటితో సెట్స్ పైకి వెళ్లనున్నారని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులలోనే బోయపాటి ఉన్నారు. అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ, తన కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను చూశారు.

అలాగే ఇప్పుడు ఆయన మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. ఆ యువ దర్శకుడి పేరే రాహుల్ సాంకృత్యాయన్ . ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నవాడాయన. రాహుల్ రీసెంటుగా బాలయ్యను కలిసి కథ చెప్పాడనీ, బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా సమాచారం..!!

2 titles in consideration for mahesh babu rajamouli film?

fans appreciate sai pallavi for her unusual demands!