1988 లో సినిమా హీరో అవుదాం అని చెన్నై వెళ్ళిన రవితేజ సంవత్సరం పాటు కాలిగానే ఉన్నాడు.ఈ టైమ్ లోనే గుణ శేఖర్, వై.వి.ఎస్ చౌదరీ పరిచయమై ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు.ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో కొన్ని సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేశాడు.రోజుకి పది రూపాయల జీతం.ఎలా 1990 లో గుణ శేఖర్ సహాయంతో కర్తవ్యం సినిమాలో చిన్న రోల్ వేశాడు.ఆ సినిమాతో కృష్ణవంశి పరిచయమయ్యాడు.అయితే కొన్ని పరిచయాలతో చిన్న చిన్న వేషాలు రాసాగాయి.కానీ డబ్బులు మాత్రం రావడంలేదు.దాంతో కృష్ణవంశీ సలహాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.ఇలా 1996 లో నిన్నే పెళ్ళాడత సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ఇదే సినిమాకు మరొక అసిస్టెంట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో స్నేహం ఏర్పడింది. కృష్ణవంశి డైరెక్షన్ లో వచ్చిన సింధూరం సినిమాలో ఒక హీరోగా చెయ్యడంతో ఇండస్ట్రీ లో మొదటిసారిగా రవితేజ పేరు వినపడింది.
ఆ తరువాత వరసగా కెరెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి. మనసిచ్చి చుడు సినిమాకి శ్రీనువైట్ల అసిస్టెంట్ డైరెక్టర్.అప్పుడే రవితేజ టాలెంట్ ను చూసి తన మొదటి సినిమా నీకోసం లో రవితేజకి అవకాశం ఇచ్చాడు.హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది ఈ సినిమా.తరువాత తన క్లోజ్ ఫ్రెండ్ అయిన పూరి జగన్నాథ్ వరుస సినిమాలలో హీరోగా తీసుకున్నాడు.వరుస హిట్లతో స్టార్ హీరో అయిపోయాడు.కృష్ణ,విక్రమార్కుడు,నేనింతే,కిక్ వంటి సినిమాలతో ఎటువంటి పాత్రను అయిన అవలీలగా చేయగలనని నిరూపించాడు రవితేజ.వచ్చిన కొత్తలో 10/- కోసం వేషాలు వేసిన రవితేజ సినిమాకు 10 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడు.దానికి కారణాలు కృషి,పట్టుదల,వ్యక్తిత్వం,ప్రతిభ .తన ప్రతిభను,వ్యక్తిత్వం చూసే గుణ శేఖర్, వై.వి.ఎస్ చౌదరీ,పూరి జగన్నాథ్,శ్రీను వైట్ల,కృష్ణ వంశీ ఇలా అందరు అతనకి క్లోజ్ అయ్యారు,అవకాశాలు ఇచ్చారు.