40 వరకు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ హీరోయిన్ సంఘవి తన 42 ఏళ్ల వయసులో తల్లి అయింది. హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే 2016లో తన 39వ ఏట ఐటీ సంస్థ యజమాని వెంకటేశ్‌ను వివాహం చేసుకుంది. ఇటీవల సంఘవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురును ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలోపంచుకుంది. దీంతో ఆమెకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 42 ఏండ్ల వయసులో సంఘవి ఒక పాపకు జన్మనివ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సింధూరం సినిమాలో ‘హాయిరే హాయ్ జాంపండురోయ్’ పాట సంఘవికి మంచి గుర్తింపును ఇచ్చింది. ఆ తర్వాత ప్రేయసి రావే, సమరసింహారెడ్డి, తాజ్‌మహాల్, శివయ్య, సూర్యవంశం, మృగరాజు వంటి అనేక చిత్రాల్లో ప్రాముఖ్యమున్న పాత్రల్లో సంఘవి నటించింది. తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, కన్నడ, తమిళం, మళయాల భాషల్లో నటించిన సంఘవి.. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ఎన్టీఆర్, శ్రీకాంత్, రాజశేఖర్ వంటి హీరోల సరసన నటించింది. వివాహం అనంతరం సంఘవి సినిమాలకు దూరమైంది. అప్పుడప్పుడు కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు జడ్జిగా హాజరై తెలుగు టీవీ ప్రేక్షకులను పలకరించింది.