in

Naveen Polishetty to work with tamil director next!

నగనగా ఒక రాజు’ చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ నటుడు నవీన్ పోలిశెట్టి, తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే ఈ నటుడు, తాజాగా ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది..

తాజా సమాచారం ప్రకారం, నవీన్ పోలిశెట్టి తదుపరి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్ తెరకెక్కించబోతున్నారు. ‘సైరన్’ వంటి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో నవీన్ నటించనుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవీన్ పోలిశెట్టికి ఉన్న అద్భుతమైన టైమింగ్, ఆంటోనీ భాగ్యరాజ్ మేకింగ్ స్టైల్ తోడైతే, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..!!

YAMUDIKI HANDICHHINA AATREYA!

Raj Nidimoru makes big reveal about maa inti bangaram 2!