
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పాన్-ఇండియా చిత్రం AA23 ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రచయిత రత్నకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కొనసాగుతోందని, దానిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన తేల్చిచెప్పారు..
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 3న రత్నకుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైనందుకు గర్వంగా ఉందని తెలుపుతూ, పోస్ట్ చివర్లో “#AA23 కోసం వేచి ఉండలేను” అని రాసుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న పుకార్లకు ఆయన ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టారు. షెడ్యూల్ సమస్యలు లేదా క్రియేటివ్ విభేదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టారని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది..!!

