in

nadiya, prabhas The Return of the Mirchi Duo!

స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌లో నదియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్‌కు సంబంధించిన క్యారవాన్ ఏర్పాట్లలో నదియా పేరుతో ప్రత్యేక క్యారవాన్ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభాస్, నదియా కలిసి నటించిన మిర్చి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నదియా నటించగా, వారి కాంబినేషన్‌కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మళ్లీ స్పిరిట్ కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో నదియా ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? కథలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది..!!

Writer shuts down rumours of aa23 movie shelved!

rashmika Mandanna’s remuneration skyrocketed for cocktail 2!