
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఒ[/qodef_dropcaps] కప్పుడు ఇండస్ట్రీ లో లక్కీ హీరోయిన్ గ పేరు పొంది స్టార్ గ ఎదిగిన భామ రకుల్ ప్రీత్ సింగ్, కానీ ఇప్పుడు తన సిన్ అంత రివర్స్ అయ్యింది. ఇండస్ట్రీ కి ఈమధ్య చాల మంది హీరోయిన్స్ రావడంతో రకుల్ ని పక్కకు పెట్టేసారు టాలీవుడ్ డైరెక్టర్స్. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అంటే తన పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
సినిమా ఛాన్సెస్ తక్కువ అవ్వడంతో డైరెక్టర్స్ ని బుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తుంది రకుల్. పూరి ఇంకా విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమా కి హీరోయిన్ వేటలో ఉన్న విషయం తెలుసుకున్న రకుల్ ఇప్పుడు ఫైటర్ సినిమాలో ఛాన్స్ కోసం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పూరి జగన్నాధ్ తో వర్క్ చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నానని, కానీ ఆ కోరిక ఇంకా తీరలేదని స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇక్కడితో ఆగకుండా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ సరసన నటించాలనే కోరికను కూడా వ్యక్తంచేస్తోంది. మరి రకుల్ కి పూరి అవకాశం ఇస్తాడో లేదో వేచి చూడాలి.