in

WHAT A MATCHING!!

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించ బడతాయి” అనేది ఒక ఇంగ్లీష్ నానుడి. అది నిజం చేయడానికి అన్నట్లు రంభ వివాహం ఇంద్రుడి తో జరిగింది. రంభ వివాహం ఇంద్రుడితో జరగడం ఏమిటి ఇదేమన్న ఫాంటసీ చిత్ర కధా? అని మాత్రం అడగకండి. టాలీవుడ్ హీరోయిన్ అయిన ముద్దు, ముద్దు మాటల రంభ, వివాహం ఇంద్రకుమార్ పద్మనాధన్ జరిగింది. సినిమాల విషయం లో ఏమో గాని నిజ జీవితం చాల మంది భార్య, భర్తల పేర్లు అస్సలు మ్యాచ్ కావు, ఎక్కడో చాల అరుదుగా ఇద్దరి పేర్లు మ్యాచ్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన జంట మన రంభ, ఇంద్ర కుమారుల జంట. రంభ ను ఇంప్రెస్ చేయటానికి ఆ పేరు పెట్టుకున్నారేమో అనుకోకండి, ఇదే అనుమానం రంభ కు కూడా వచ్చింది, అందుకే పెళ్లి చూపులలోనే మొహమాటం లేకుండ అడిగేసారు రంభ ఆ విషయాన్నీ. దానికి సమాధానంగా వెంటనే ఇంద్రకుమార్ తన పాస్ పోర్ట్ తీసి చూపించారట..

ఇది నాకు తల్లి,తండ్రులు పెట్టిన పేరు అని. రంభ ఒక టి.వి. చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివాహం గురించి తనకు ఉన్న అభిప్రాయాలను చెప్పటం జరిగింది, అది చూసిన ఇంద్రకుమార్ ఇంప్రెస్ అయి, తమ బంధువుల ద్వారా ప్రపోసల్ పంపారట. వీరిద్దరూ మొదటి సారి కలసి మాటలాడుకున్నప్పుడు , ఇద్దరి అభిప్రాయాలూ, అభిరుచులు కలవటమే కాదు పేర్లు కూడా కలవటం తో, ఏప్రిల్, 8 వ తేదీ 2010 లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఒక ఇంటివారు అయ్యారు.ఇప్పుడు రంభ, ఇంద్రకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, కుమార్తెకు ఇంద్రజ అని పేరు పెట్టి ఉంటారు అనుకుంటున్నారు కదూ? లేదండి వారిద్దరి పేర్లు లాన్య, సాషా..!!

anchor Anasuya To Go Legal Against ‘Aunty’ Trolls!

VIBHINNAMAYINA” MANASUNNA MAARAJU “!