
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సౌ[/qodef_dropcaps] త్ స్టార్ హీరోయిన్ త్రిష చేసిన ఓ పనికి కోలీవుడ్ సినీ పరిశ్రమ తనకు వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా సినీ పరిశ్రమ నుండి తీసేస్తాం అన్నారట. ఇంతకీ త్రిష చేసిన ఆ పని ఏంటి అనుకుంటున్నారా… అయితే కోలీవుడ్ లో అవతల ఎంత పెద్ద హీరో అయిన సరే ఏ సినిమా అయిన సరే ప్రమోషన్ కు రాదు నయనతార. తాను ముందుగానే నిర్మాతతో ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు త్రిష కూడా ఆ పనే చేయాలనుకుంది కానీ బుకైపోయింది. త్రిష నటించిన ‘పరమపదం విళ్లైయాట్టు’ సినిమా ప్రమోషన్ కి రాలేదు. అయితే ఈ ఘటన పై నిర్మాతల మండలి ఈసీ మెంబర్ శివ ఆగ్రహం వ్యక్తం చేసారు. తరువాత జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొనకపోతే తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కి తిరిగి ఇవ్వాలని లేకపోతే మండలి పరంగా చర్యలు తీసుకుంటామని అవసరమైతే సినీ పరిశ్రమ నుండి తొలిగిస్తాం అని అన్నారు. అయితే ఈ విషయం పై త్రిష ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.