in

vv vinayak sensational comments on ycp leader kodali nani!

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న వి.వి.వినాయక్.. గత దశాబ్ద కాలంలో స్థాయికి తగ్గ సినిమాలు తీయక బాగా వెనుకబడిపోయాడు. ఈ మధ్య ఆయన అసలు లైమ్ లైట్లో లేడు. హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తున్నప్పటికీ దాని గురించి ఇక్కడ సౌండేమీ లేదు. కాగా వినాయక్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సినిమాలతో పాటు రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు.వినాయక్‌‌ది పొలిటికల్ ఫ్యామిలీనే కావడంతో ఆంధ్రా ప్రాంత రాజకీయ నాయకులు చాలామందితో సన్నిహిత సంబంధాలున్నాయి.

ఈ క్రమంలో ఒకప్పటి తెలుగుదేశం నేత, ప్రస్తుత వైకాపా నాయకుడు అయిన కొడాలి నాని గురించి వినాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీడీపీలో నానికి టికెట్ తెప్పించడంలో తన పాత్ర కూడా ఉందని వినాయక్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను, జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి చంద్రబాబుతో నాని టికెట్ గురించి మాట్లాడినట్లు అతను తెలిపాడు. ఐతే ఎందుకో తెలియదు కానీ.. నానికి చంద్రబాబు అంటే ముందు నుంచి అసలు పడదని వినాయక్ వెల్లడించాడు.

ఎన్టీ రామారావు అంటే కొడాలి నానికి అమితమైన ప్రేమ అని.. ఆయన కోసం గొంతు కోసేసుకుంటాడని.. ఆయన విషయంలో చంద్రబాబు చేసింది నచ్చక కోపం పెంచుకుని ఉండొచ్చనే ఉద్దేశంలో వినాయక్ మాట్లాడాడు. చంద్రబాబుకు, నానికి మధ్య ఏం ఉందో, ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ నాని మాత్రం తమ ఆంతరంగిక సంభాషణలప్పుడు కూడా చంద్రబాబును దారుణంగా తిడుతుంటారని.. ఆ మాటలు భరించలేని విధంగా ఉంటాయని వినాయక్ తెలిపాడు…

‘Thank You’ Just To Be Another ‘Maharshi’!

Katrina Kaif-Vicky Kaushal gets death threat by a fan!