in

viral: Trivikram asking For Meenakshi Chaudhary’s Dates

తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేసే దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. అప్పట్లో పార్వతి మిల్టన్, ఇలియానా వంటి వారిని రిపీట్ చేశాడు త్రివిక్రమ్. ప్రస్తుతం గురూజీ లిస్ట్ లో పూజ హెగ్డే, సంయుక్త మీనన్ లతో పాటు మరో హీరోయిన్ చేరింది. ఆమె ఎవరో కాదు, హిట్2 సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన మీనాక్షి చౌదరి. సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డేని తప్పించి మీనాక్షిని తీసుకోవటమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు..

మొదట మెయిన్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డేను తప్పించి శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారన్న వార్తలొచ్చాయి, ఆ తర్వాత మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ స్థానంలో తీసుకున్నారని సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ అప్పట్లో ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ అన్న సినిమాకి సంబంధించిన ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరై హీరోయిన్ మీనాక్షిని డేట్స్ అడిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అప్పట్లో మీనాక్షి మీద మనసు పడ్డాడు గురూజీ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..!!

jr ntr and ram charan to be part of oscar Academy committee!

spy!