in

viral: Balakrishna Orders to Remove Jr NTR Flexis at NTR Ghat!

NTR వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చంద్రబాబు బాలకృష్ణ తదితరులు అన్నగారికి నివాళులర్పించారు. అయితే, అంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు..

ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ అక్కడ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ చెప్పడం సంచలనం రేపుతోంది‌. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీసివేయాలని బాలకృష్ణ తన అనుచరులకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది..!!

trivikram – ram pothineni movie to go on sets soon?

SreeLeela in talks for Pushpa 2 special song!