in

Vijay’s ‘Master’ tops IMDb list of most popular Indian films in 2021!

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిల‌వ‌గా, ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం దక్కించుకుంది.

విజయ్,విజయ్ సేతుపతి,మాళవికా మోహనన్,ఆండ్రియా,శాంతను భాగ్యరాజ్,అర్జున్ దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో లోకేష్ కనకరాజ్ తెర‌కెక్కించిన చిత్రం ఈ ఏడాది థియేట‌ర్‌లో విడుద‌ల కాగా, 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లని సాధించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకోగా, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి చాలా క్రూరంగా కనిపించాడు. ఊర మాస్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు.

Mega hero falls in love with Sonakshi Sinha!

thana director, producer maata lekka cheyani silk smitha!