in

Mega hero falls in love with Sonakshi Sinha!

తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు వైష్ణవ్. ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ అవర్ నిర్వహించాడు..మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని అడగ్గా.. రజనీకాంత్ అని చెప్పాడు. ఆయన సినిమాల్లో శివాజీ తనకు చాలా ఇష్టమని ఇప్పటి వరకు చాలా సార్లు ఆ సినిమా చూశానన్నాడు వైష్ణవ్. ఇక తన మొదటి హీరోయిన్ కృతిశెట్టిలో ఉన్న మరో టాలెంట్ ఏంటీ అని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి కూడా వెల్లడించాడు వైష్ణవ్.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత గిరీశయ్య డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నట్టు చెప్పాడు. వీటి తర్వాత ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్టు తెలిపాడు. ఇక తనకు బాలీవుడ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ అంటే ఇష్టమని గతంలో చెప్పాడు వైష్ణవ్. ఇదే విషయాన్ని తాజాగా రిపీట్ చేశాడో నెటిజన్. మీకు సోనాక్షి అంటే ఎందుకు అంత ఇష్టం? అని అడిగాడు. దీనికి.. ఆమె ఇంటే తనకు ఇష్టం మాత్రమే కాదని ప్రేమ అని చెప్పాడు. ఇప్పటికీ.. తనను ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పాడు.

Rakul Preet Singh on rape case in Manesar: “My blood boils”

Vijay’s ‘Master’ tops IMDb list of most popular Indian films in 2021!