in

VIJAY TESTED FOR CORONA ?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]దే[/qodef_dropcaps]శ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తమిళ నటుడు విజయ్ ఒకరు. అభిమానులు ముద్దుగా ‘దళపతి’ అని పిలుచుకునే విజయ్ ని అతని ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ మొదటి వరసలో ఉంటాడు. ‘తుపాకి’, ‘సర్కార్’, ‘పోలీసోడు’, ‘విజిల్’ మరియు ‘అదిరింది’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇదిలా ఉండగా హీరో విజయ్‌ దళపతి ఇంటిని ఆరోగ్య శాఖ అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేశారు.

కోవిడ్‌-19 నేపథ్యంలో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి కరోనా వైరస్‌ బారిన పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు.

ఇందుకోసం గత రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లిన వారి జాబితాను తీసుకుని వారందరి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు. ఇక ఈ జాబితాలో హీరో విజయ్‌ కూడా ఉండటంతో చెన్నైలోని ఆయన నీలంకరి నివాసాన్ని కూడా అధికారులు సందర్శించారు. కాగా వైద్యులు విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఈ మహమ్మారి బారిన ఆయన కుటుంబ సభ్యులేవరు పడలేదని నిర్ధారించారు.

అంతేగాక ఆరు నెలల ముందు విజయ్‌ మీనహా ఆయన కుటుంబ సభ్యులేవరు విదేశాలకు వెల్లలేదని నిర్థారించుకుని ఇంటిలో శానిటైజర్‌ స్ర్పే చేసి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న ‘మాస్టర్‌’ సినిమా పేర్కొంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. విజయ్ ఇంట్లో ఆయనకి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని వార్త బయటకి రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వైద్యుల బృదం విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. వారు ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారణ కావడం తో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు.

heroines debuted before turning 18!

bahubali actress pics on dating app!