in

Vijay Antony’s daughter meera dies by suicide!

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది..ఆయన కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆమె గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌ లో ఉందట. ఆమె చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. తమిళ మీడియా ఛానల్స్ ప్రకారం, ఆమె తండ్రి విజయ్ ఆంటోనీ తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తె గదిలోకి వెళ్లినప్పుడు..

ఆమె ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చూసి షాక్ అయ్యాడు. ఇంట్లో పనిచేసే కూలీల సాయంతో ఆమెను కిందకు దించి కారులో కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మీరా యొక్క విషాదకరమైన ఆత్మహత్య..నిరాశ, ఒత్తిడిలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం చెబుతున్నారు..!!

trivikram brings 3rd heroine for guntur kaaram?

happy birthday vennela kishore!