in

videshi driver kosam car konichina anushka!

ప్రముఖ నిర్మాత, జబర్దస్త్ షో సృష్టికర్త అయిన, శ్యాంప్రసాద్ రెడ్డి గారు హాలిడే ట్రిప్ కి జార్జియా అనే దేశానికీ వెళ్ళారు, అక్కడ తాను ముందుగానే ఆరెంజ్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ద్వారా తమ అరుంధతి చిత్ర హీరోయిన్ గురించి ఒక నిజం తెలుసుకొని ఆశ్చర్య పొయారు, అదేమిటో మీకు తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ మొత్తం స్టోరీ చదవండి. ఒక తమిళ్ చిత్రం షూటింగ్ కోసం జార్జియా కు వెళ్లిన అనుష్క కు కూడా ఇదే క్యాబ్ డ్రైవర్ పని చేసాడు. మూడు వారలూ ఆమెకు సర్వీస్ చేసిన ఈ డ్రైవర్ ఒక రోజు వేరే క్యాబ్ ను పంపించాడట, కొత్త డ్రైవరును చూసిన అనుష్క, రెగ్యులర్ డ్రైవర్ గురించి షూటింగ్ ఆర్గనైజర్ ను అడుగగా..

అతను క్యాబ్ ఇన్స్టాల్మెంట్స్ సరిగా పే చేయక పోవటం వలన అతని కారు, బ్యాంకర్స్ సీజ్ చేసారు అందుకే కొత్త క్యాబ్ ఆరెంజ్ చేసాము అని చెప్పారట, తన రెగ్యులర్ డ్రైవరును పిలిపించమని చెప్పి , అతను ఈవెనింగ్ వచ్చాక అతనిని వెంటపెట్టుకొని ఒక కార్ షో రూమ్ కి వెళ్లి అతనికి ఒక కొత్త కార్ తన డబ్బుతో కొనిచ్చి, రేపటి నుంచి నువ్వే నీ కార్ లో నన్ను తీసుకొని వెళ్ళాలి అని చెప్పారట. మూడు వారాలు అతని బిహేవియర్ చూసిన అనుష్క అతనికి వచ్చిన కష్టాన్ని చూసి చలించిపోయి అతనికి ఆ సహాయం చేసారు. విషయం చెప్పిన డ్రైవర్ ఆమె తనకు, తన కుటుంబానికి అన్నం పెట్టిన దేవత అని చెప్పాడట. నిజంగా స్వీటీ గారిది ఎంత స్వీట్ హార్ట్ చూడండి. దేశం కానీ దేశం మన భాష కానీ భాష అయినా ఒక సాటి మనిషి కష్టాన్ని గమనించి సహాయం చేసిన తన విశ్వజనీయకమయిన మనసుకు శిరసు వంచి పాదాభివందనం చేయ వచ్చు కానీ ఆమె చేసిన ఈ సహాయం గురించి ఎవరికీ చెప్పలేదు, తరువాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆమెతో ఈ విషయం ప్రస్తావించినప్పుడు కూడా అదేమీ అంత పెద్ద విషయం కాదన్నట్టు ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్లిపోయారట అనుష్క గారు. రియల్లీ యు అర్ గ్రేట్ జేజమ్మ.

‘andhrawala’ audio function records!

laxmi raai on her affairs!