in

Veteran actor Pradeep Rawat passed away at 74!

భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ విలన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రదీప్ రావత్ తన నట జీవితాన్ని బి.ఆర్. చోప్రా రూపొందించిన ప్రముఖ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ లో అశ్వత్థామ పాత్రతో ప్రారంభించారు..

ఆ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించిన ఆయన, అనంతరం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో విలన్‌గా తనదైన ముద్ర వేశారు. హిందీలో ‘లగాన్’, ‘సర్ఫరోష్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్.. తెలుగులో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో ‘భిక్షు యాదవ్’ పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం ‘గజినీ’, ‘భద్ర’, ‘స్టాలిన్’, ‘ఛత్రపతి’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో తన విలక్షణ నటనతో మెప్పించారు..!!

Brett Lee Slams Preity Zinta Dating Rumors: 'Just Great Friends'

Brett Lee Slams Preity Zinta Dating Rumors: ‘Just Great Friends’

“Treated my body like machine”: Rashmika Mandanna