in

venky mama was the first choice for ‘krack’!

సంక్రాంతి సందర్బంగా విడుదలైన క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజా అందరని అలరించారు. ఈ సినిమా విడుదల రోజు కాస్త ఆలస్యం అయినా బొమ్మ మాత్రం అదిరిపోయింది. చాలా కాలం తరువాత రవితేజా ఫుల్ మీల్స్ లాంటి సినిమా చేశాడని అభిమానలు సంతృప్తి చెందారు. ఈ సినిమాతో గోపీచంద్, రవితేజా కాంబో హ్యాట్రిక్ చేసింది. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే క్రాక్ సినిమాను మొదటగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాకే రవితేజ చెంతకు చేరిందట.

అయితే ఆ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో కాదు. టాలీవుడ్‌లె విజయాన్నే ఇంటిపేరు చేసుకున్న విక్టరీ వెంకటేష్. మొదటగా ఈ సినిమా కథను తీసుకొని గోపీ వెంకీని కలిసాడట. కథ మొత్తం విన్న వెంకీకి కథపైన అంత నమ్మకం కలుగలేదంట.దాంతో కథలో కొన్ని మార్పులు చేయాలని ఆ మార్పులను చెప్పాడట. కానీ గోపీ ఆ మార్పులు చేయడానికి సుముఖం చూపలేదట. దాంతో వెంకీ ఈ సినిమాకి నో చెప్పాడు. దాని తరువాత అదే కథను రవితేజ వద్దకు తీసుకెళ్తే రవితేజ వెంటనే ఓకే చెప్పాడట.

master!

thapsi decided to Avoid Glamorous Roles!