in

Venky mama to star in Telugu remake of ‘Drishyam 2’!

మోహన్ లాల్ సినిమా అంటేనే ప్రత్యేక స్థాయి ఉంటుంది. అతడు నటించిన మలయాళ సినిమా దృశ్యం బ్లాక్ బాస్టర్‌గా రికార్డులు తిరగరాసింది. తన భాషలోనే కాకుండా ఇరుగు పొరుగు భాషల్లో కూడా సంచలనాలు చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాలు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయింది. అయితే ఈరోజు ఈ సినిమా సీక్వెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.

దృశ్యం సినిమాలో హీరో తన తెలితేటలతో తన కుటుంబంపై హత్యా నేరం పడకుండా కాపాడతాడు. తన భార్య, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులను, వ్యవస్థను తప్పు దోవ పట్టిస్తాడు. ఇలాంటివి ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. అన్నింటిని కలిపి ఎంతో వినోదాత్మకంగా నిర్మించారు. ఇక దృశ్యం 2 సరిగ్గా మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మళ్ళీ దానిని రీమేక్ చేయాలని వెంకటేష్ నిర్ణయిచుకున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ లో అజయ్, టబు రీమేక్ చేస్తుండగా ఇంకడా మళ్ళీ వెంకటేష్, మీనా చేయనున్నారు.

Pragya Jaiswal to play a cop with starring Mohan Babu!

anchor srimukhi roped in for Nithiin’s ‘Andhadhun’ remake!