in

Pragya Jaiswal to play a cop with starring Mohan Babu!

సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఓ పోలీస్ అధికారి పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఓకే చేశారంట.

అయితే ప్రగ్యాకు పోలీస్ పాత్ర చేయడం ఇదేం మొదటి సారి కాదు. ఇదివరకే నక్షత్రం సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్యా కనిపించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ప్రగ్యా జైస్వాల్ పాల్గొన్నారు. అమ్మడు ప్రస్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీలోనూ ఓ సినిమా అవకాశం అందుకున్నారు. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ చేయనున్న అంతిమ్ సినిమాలో నటించనున్నారు. కాగా… ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నారు.

nithin’s heroine Megha Akash bags a biggie!

Venky mama to star in Telugu remake of ‘Drishyam 2’!