in

Venkatesh’s daughter makes it to Instagram Rich List 2021!

ప్పుడంతా సోష‌ల్ మీడియాదే హ‌వా న‌డుస్తోంది. మరీ ముఖ్యంగ సెల‌బ్రిటీల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌లు ఎంతో పేరును తీసుకొస్తున్నాయి. క్రేజ్‌తో పాటే డ‌బ్బులు కూడా సంపాదించుకుంటున్నారు ఈ సెల‌బ్రిటీలు. ఇక ఇన్ స్టా గ్రామ్ త‌న యాప్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి అంద‌రికంటే ఎక్కువ సంపాదిస్తున్న కొంద‌రు సెలబ్రిటీల లిస్టును తాజాగా హాపర్ కంపెనీ రిలీజ్ చేసింది. ఇక్క‌డ విశేషం ఏంటంటే ఈ లిస్టులో మ‌న ఇండియ‌న్ల‌కు మూడు ప్లేస్‌లు ద‌క్కాయి. అందులోనూ మ‌న టాలీవుడ్ విక్ట‌రీ హీరో అయిన వెంక‌టేశ్ కుమార్తెకు కూడా ప్లేస్ ద‌క్కింది.

వెంకటేష్ కుమార్తె అయిన ద‌గ్గుబాటి ఆశ్రితకు ఇందులో మూడో ప్లేస్ సంపాదించింది. ఇన్ స్టా గ్రామ్ లో లక్ష్ల‌లో ఫాలోవర్లు కలిగిన వారికి ఆ సంస్థ యాజ‌మాన్యం వారు చేసే ప్ర‌తి పోస్టుకు చాలా ఖ‌రీదైన రెమ్యున‌రేష‌న్ ఇస్తుంది. ఈ జాబితాలో భార‌త్ నుంచి ప్రియాంక చోప్రాతో పాటు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానాల్లో ఉన్నారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత కూడా వీరి స‌ర‌స‌న నిలిచింది. ఆమెకు ఇన్ స్టా గ్రామ్‌లో 136,359 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె ఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతోంది. ఆమె చేసే ప్ర‌తి పోస్టుకు రూ.31 వేలు చెల్లిస్తోంది ఇన్ స్టా గ్రామ్‌.

Neha Sharma slaying it at the beach!

Aakanksha Singh to reunite with Nani for ‘Meet Cute’!