in

Venkatesh, Siva Karthikeyan to join hands for a multistarrer!

ఒకప్పుడు ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మల్టీ స్టారర్లు కామన్ అయిపోయాయి. హీరోలు కూడా కథ నచ్చితే.. ఇంకొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అయితే తాజగా వెంకటేశ్ ఓ తమిళ హీరోతో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నాడని టాక్. మల్టీ స్టారర్ సినిమాలను మళ్లీ ట్రెండ్‌లోకి తీసుకొచ్చిన హీరో ఎవరంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని.. ఇతర హీరోలకు మల్టీ స్టారర్లు చేయాలన్న ఇంట్రెస్ట్ రప్పించిన క్రెడిట్ వెంకటేశ్ సొంతం.

అందుకే ఇప్పుడు దర్శకులు ఎవరైనా మల్టీ స్టారర్ తెరకెక్కించాలనుకుంటే వారికి ముందుగా గుర్తొచ్చే పేరు వెంకటేశ్. ‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్.. శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉక్రెయిన్ భామ మారియాను సెలక్ట్ చేస్తారు. తాజాగా ఈ సినిమాలో వెంకటేశ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్ టాప్ స్టార్లతోనే స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేశ్.. త్వరలోనే ఓ తమిళ యంగ్ హీరోతో కూడా మల్టీ స్టారర్ చేస్తున్నాడన్న వార్త తన ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది..

upendra to play key role in mahesh babu – trivikram movie?

maruthi wants Anushka Shetty for prabhas again!