in

maruthi wants Anushka Shetty for prabhas again!

ప్రభాస్-అనుష్క జోడీ వెండితెరపై సూపర్ హిట్‌గా నిలిచింది. వీరిద్దరూ కలిసి నటించిన బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ విజయవంతమయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే వీటన్నింటికి ఇరువురు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తున్నారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలుమార్లు స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ వీరి ప్రేమ వార్తలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా ప్రభాస్ సరసన అనుష్క మరోసారి జోడీ కట్టబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మారుతీ డైరక్షన్‌లో డార్లింగ్ చేయనున్న ప్రాజెక్టులో స్వీటీనే హీరోయిన్‌గా తీసుకోనున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఇందులో అనుష్క ఒకరని తెలుస్తోంది. స్వీటీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ చొరవతో ప్రభాస్‌ పక్కన సినిమాకు సై అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. దీని గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Venkatesh, Siva Karthikeyan to join hands for a multistarrer!

Raai Laxmi Red Bikini pics in pool!