in

Venkatesh says ‘Rana Naidu 2’ won’t offend anyone!

వెంకటేష్ కెరీర్ లోనే మొదటిసారి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విమర్శలు అందుకున్న వెబ్ సిరీస్ రానా నాయుడు ఫీడ్ బ్యాక్ సీరియస్ గానే పని చేసింది. ఇవాళ జరిగిన సైంధవ్ ఆడియో సింగల్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక అభిమాని తెచ్చిన ప్రస్తావనకు వెంకీ స్పందించారు. ఫస్ట్ సీజన్ ని కుర్రాళ్ళు ఎంజాయ్ చేశారని, అయితే పెద్దోళ్ళు ఏంట్రా ఇలా చేశావని అడగటంతో ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తామని, నెట్ ఫ్లిక్స్ నుంచి ఆల్రెడీ కాల్ వచ్చిందని త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామనే సంకేతం ఇచ్చారు.

సో కొనసాగింపు గురించి అఫీషియల్ గా చెప్పారు..దీన్ని బట్టే కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ప్రభావం చూపించినట్టు అర్థమైపోయింది. నిజంగానే రానా నాయుడులో అబ్జెక్షన్ అనిపించే కంటెంట్ చాలా ఉంది. అడల్ట్స్ ఓన్లీ అనే ట్యాగ్ పెట్టారు కానీ ప్రముఖ దిన పత్రిలలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చినప్పుడు పరిమితంగా పెద్దలు మాత్రమే చూడండని పరిమితం చేయడం కష్టం. ఈ సమస్య వల్లే ఏముందో తెలియకుండా కేవలం వెంకటేష్ చేశాడనే నమ్మకంతో మొదలుపెట్టేసి నిమిషాల్లో ఆపేసిన లేడీ ఫ్యాన్స్ చాలా ఉన్నారు..!!

HAPPY BIRTHDAY MANCHU VISHNU!

mehreen pirzada taking director maruthi’s advice!